కలెక్టర్‌కు శుభాకాంక్షల వెల్లువ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్ నారాయణరెడ్డిని పలువురు అధికారులు గురువారం ఆయన చాంబర్‌లో కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. విషెస్ తెలిపిన వారిలో అదనపు కలెక్టర్లు కె.చంద్రారెడ్డి, శ్రీనివాస్‌తో పాటు డీఆర్‌ఓ సంగీత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా వైద్యాధికారి కె.లలితాదేవి, డీపీఓ సురేష్‌మోహన్ తదితరులు ఉన్నారు.
రోడ్డు భద్రత కరపత్రాల ఆవిష్కరణ
ఇబ్రహీంపట్నం రూరల్: రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో గురువారం రోడ్డు భద్రత మాస వేడుకలకు సంబంధించి కరపత్రాలను, బ్రోచర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీటీసీ, ఎంవీఐ, ఏఎంవీఐలు, ఈఈఅర్‌అండ్‌బీ బృందంతో పాటు మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు .
క్యాలెండర్ ఆవిష్కరణ
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను గురువారం కలెక్టర్ నారాయణరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, శ్రీనివాస్, సంగీత, సంఘం జిల్లా అధ్యక్షుడు రామారావు, కార్యదర్శి శ్రీనేష్‌కుమార్, మాజీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


