‘మత్తు’ దందాకు చెక్‌..! | - | Sakshi
Sakshi News home page

‘మత్తు’ దందాకు చెక్‌..!

Jan 2 2026 12:26 PM | Updated on Jan 2 2026 12:26 PM

‘మత్తు’ దందాకు చెక్‌..!

‘మత్తు’ దందాకు చెక్‌..!

‘మత్తు’ దందాకు చెక్‌..!

రాజేంద్రనగర్‌: తన గుడారం పక్కనే గంజాయి మొక్కలను పెంచుతున్న యువకుడిని రాజేంద్రనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఎస్‌ఐ రాఘవేందర్‌ తెలిపిన మేరకు.. బిహార్‌కు చెందిన రాజేందర్‌ (30) తల్లిదండ్రులు, సోదరితో కలిసి రోడ్లపై వన మూలికలను విక్రయిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతంలో తాత్కాలిక గూడారాలను వేసుకొని నివసిస్తున్నాడు. కిస్మత్‌పూర్‌లోని ఖాళీ స్థలంలో కొద్ది రోజులుగా గుడారాలను వేసుకొని నివస్తున్నాడు. తన గుడారం పక్కనే గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగాయి. గంజాయి మొక్కలు కనిపించకుండా పరదాలను ఏర్పాటు చేశారు. ఈ విషయమై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు వెళ్లి తనిఖీలు చేపట్టగా అవి గంజాయి మొక్కలుగా నిర్ధారించారు. దీంతో వాటిని ధ్వంసం చేసి రాజేందర్‌ను అదుపులోకి స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

డ్రగ్స్‌తో పట్టుబడ్డ యువతి

బంజారాహిల్స్‌: వెకేషన్‌ కోసమో, హాలిడే ట్రిప్‌ కోసమో చాలా మంది గోవాకు వెళ్తుంటారు. అందరిలాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గోవాకు వెళ్లింది. అయితే ట్రిప్‌ ఎంజాయ్‌ చేసి రాలేదు. డ్రగ్‌ పెడ్లర్స్‌తో పరిచయాలు పెంచుకుని దందాలోకి దిగింది. గుట్టుచప్పుడు కాకుండా గోవా నుంచి సిటీకి డ్రగ్స్‌ సరఫరా చేస్తూ వ్యాపారాన్ని విస్తరించింది. న్యూ ఇయర్‌ కోసం చేసిన ప్లాన్‌ బెడిసికొట్టడంతో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నిందితురాలిని అరెస్టు చేశారు. నిందితురాలిని బంజారాహిల్స్‌కు చెందిన హస్సాగా గుర్తించారు. గోవా నుంచి ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ సరఫరా చేసినట్లు బంజారాహిల్స్‌ పోలీసులు గుర్తించారు నైజీరియన్‌ సరఫరాదారుల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. హస్సా 2024 డిసెంబర్‌లో గోవా పర్యటనలో భాగంగా డ్రగ్స్‌ పెడ్లర్స్‌తో పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాగటర్‌ క్లబ్‌లో ఎండీఎంఏ వినియోగించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు చెప్పారు. 2025 మార్చి నుంచి పలుమార్లు గోవాకు వెళ్లి డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హస్సా డిసెంబర్‌ 26న సియోలిమ్‌, మాపూసాలో ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ అందజేసినట్లు తేలింది. హైదరాబాద్‌కు చెందిన మరికొందరితో కలిసి డ్రగ్స్‌ విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్‌ కేసులో గతంలో అరెస్టయినట్లు చెప్పారు.

నగరంలో మత్తు దందా నిర్వహిస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌, గంజాయి కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిందితులు వారి కళ్లుగప్పి సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త దారుల్లో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారు. ఓ యువకుడైతే ఏకంగా బహిరంగ ప్రదేశాల్లో గంజాయి మొక్కలు పెంచుతుండగా.. మరో యువతి ఏకంగ్రా డ్రగ్స్‌ విక్రయిస్తోంది. ఇక ఇద్దరు యువకులు కొకై న్‌ తరలిస్తుండగా పట్టుబడ్డారు.

గంజాయి మొక్కలు పెంచుతున్న యువకుడు

డ్రగ్స్‌విక్రయిస్తూ యువతి

కొకై న్‌ తరలిస్తుండగాఇద్దరు యువకులు

వేర్వేరు ప్రాంతాల్లో నిందితుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement