రాజ్‌పాకాల కేసు వీడియోలు వైరల్
శంకర్‌పల్లి: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలపై మోకిల పీఎస్‌లో నమోదైన కేసు, చార్జిషీట్ అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతేడాది అక్టోబర్ 26న రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలోని ఫాంహౌస్‌లో అనుమతి లేకుండా పార్టీ నిర్వహించారని, ఇందులో విదేశీ మద్యం వినియోగించారనే అభియోగాలపై కేసు నమోదైంది. దీనిపై జూన్ 30న చార్జిషీట్ దాఖలు చేశారు. ఈఅంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసులో 35 మందిని విచారించిన తర్వాత, అనుమతి లేకుండా ఫాంహౌస్‌లో విదేశీ మద్యంతో పార్టీ చేసిన రాజ్ పాకాలపై, డగ్ర్ పరీక్షలో పాజిటివ్‌గా తెలిసిన విజయ్ మద్దూరిపై గతంలోనే చార్జిషీట్ దాఖలు చేశామని మోకిల సీప వీరబాబు తెలిపారు.
స్వార్థ ప్రయోజనాలకు యూనియన్ పేరు వాడొద్దు
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు గణేష్
షాద్‌నగర్‌రూరల్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) సంఘం పేరును తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే సహించేది లేదని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేరిబాయి గణేష్, మైల సైదులు హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని టీడబ్ల్యూజేఎఫ్ కార్యాలయంలో సంఘం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేందర్‌గౌడ్, నరేష్ అధ్యక్షతన సంఘం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వ్యక్తిగత అవసరాల కోసం సంఘం పేరును తప్పుగా వాడుకుంటున్నాని, ఇది సరైన పద్దతి కాదన్నారు. కొందరు జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడిగా చలామణి అవుతున్నారని, సమంజసం కాదన్నారు.
రాజ్‌పాకాల కేసు వీడియోలు వైరల్


