వైభవంగా ధ్యాన మహాయాగాలు
కడ్తాల్: మండల పరిధిలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు ధ్యాన జనుల సందడితో వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న ధ్యానులతో, పత్రీజీ ధ్యాన మహాయాగాలు–4 బుధవారానికి నాలుగో రోజుకు చేరుకున్నాయిఽ. ఉదయం సంగీత విధ్వాంసుడు సంజయ్‌కింగి బృందం ఆధ్వర్యంలో సామూహిక ప్రాతఃకాల సంగీత ధ్యానం నిర్వహించారు. అనంతరం ధ్యాన గురువు పరిణిత పత్రి ధ్యానులను ఉద్దేశించి ప్రసంగించారు. పత్రీజీ ఆశయ సాధనకు ధ్యానులు కృషి చేయాలన్నారు. ధ్యానం ద్వారం పొందిన జ్ఞానాన్ని దైనందిన జీవితంలో ఆచరించకపోతే ప్రయోజనం శూన్యమని తెలిపారు. జీవిత ధ్యేయం తనను తాను తెలుసుకోవాలనే పత్రీజీ ఇచ్చిన ఫార్మూల ఎంతో గొప్పదని కొనియాడారు. అనంతరం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ నిర్వాహకుడు శ్రేయాన్స్‌దాగా ప్రసంగిస్తూ.. ధ్యానంలో మనసు ఎప్పుడైతే శూన్యమవుతుందో మనల్ని మనం తెలుసుకోగలుతామని అన్నారు. కోట్లాది మంది ధ్యానులను పత్రీజీ తయారు చేశారని కొనియాడారు. అనంతరం పలు ఆధ్యాత్మిక పుస్తకాలను, నూతన సంవత్సర క్యాలండర్‌లను, ఎనిమిదేళ్ల పీఎంసీ చరిత్రపై రూపొందించిన పీఎంసీ సావనీర్‌ను పిరిమిడ్ ట్రస్ట్ సభ్యులు, మాస్టర్‌లతో కలిసి పరిణిత పత్రి, ట్రస్ట్ చైర్మన్ విజయ్‌భాస్కర్‌రెడ్డి ఆవిష్కరించారు. ధ్యాన వేదికపై కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ధ్యానుల, పిరమిడ్ మాస్టర్‌ల అనుభవాలు ధ్యానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మీడియా కో–ఆర్డినేటర్ భాస్కర్‌రెడ్డి, ట్రస్ట్ సభ్యులు హనుమంతరాజు, మాధవి, లక్ష్మి, నిర్మల, దామోదర్‌రెడ్డి, రవిశాసీ్త్ర, ఫౌండర్ బుద్ధ, సీఈఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నాలుగో రోజుకు చేరిన వేడుకలు
వైభవంగా ధ్యాన మహాయాగాలు


