నూతన జాయింట్ సెక్రటరీగా బద్యానాథ్‌చౌహన్
ఆమనగల్లు: తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ గెజిటెడ్ ఆఫీసర్ల ఫోరం జాయింట్ సెక్రటరీగా ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్‌చౌహన్ ఎన్నికయ్యారు. నాంపల్లిలోని టీజీఓ భవన్‌లో బుధవారం ఫోరం ఎన్నికలు నిర్వహించారు. ఎలక్షన్ ఆఫీసర్‌గా కృష్ణయాదవ్, అసిస్టెంట్ ఆఫీసర్‌గా రామారావు వ్యవహరించారు. నూతన జాయింట్ సెక్రటరీగా ఎన్నికై న బద్యానాథ్‌చౌహన్‌ను ఫోరం అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఎకై ్సజ్ శాఖ అడిషనల్ కమిషనర్ ఖురేషీ, సురేశ్‌రాథోడ్ తదితరులు ఘనంగా సన్మానించారు.


