ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి
కడ్తాల్: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుందని ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని బాలాజీనగర్ తండాకు చెందిన బీజేపీ నాయకుడు కొర్రదేవు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి వంశీచంద్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అమర్‌సింగ్, మాజీ సర్పంచ్ నరేందర్, నాయకులు సురేందర్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, బలరాంనాయక్, పర్వతాలు, రమేశ్‌గౌడ్, గణేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తుక్కుగూడ: ఆశా కార్యకర్తల సంక్షేమం కోసం తమ వంతు కృషి చేస్తామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.లలితాదేవి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆశా కార్యకర్తలకు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసులు చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలోని 1,358 మంది ఆశా కార్యకర్తలకు చీరలు అందజేశామని చెప్పారు. ఆశాలకు ప్రభుత్వం ఏటా ఒక జత యూనిఫాం రూపంలో చీరలను అందిస్తుందన్నారు. ఆశాలు గ్రామీణ స్థాయిలో ఆరోగ్య కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆమనగల్లు: వరంగల్‌లో జనవరి 5 నుంచి 7 వరకు జరిగే పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఈ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ కోరారు. ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను విద్యార్థులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్‌యూ నిరంతరం పోరాడుతుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు కార్తీక్, వంశీ, నిశాంత్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
జాగృతి జిల్లా అధ్యక్షుడు పాండురంగారెడ్డి
కందుకూరు: ఒకరిపై ఒకరు నెపం మోపుకొంటూ రాజకీయ పబ్బం గడుపుకోవడమే తప్పా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎవరికీ చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన చూస్తే దక్షిణ తెలంగాణకు గుండెకాయ లాంటి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేవలం నినాదంగానే ఉందన్నారు. మూడేళ్లల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పుకొనే బీఆర్‌ఎస్, పాలమూరు ప్రాజెక్టును మాత్రం పదేళ్లపాటు పాతరేశారని మండిపడ్డారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ నాయకులు నిద్రలేచి మాట్లాడుతున్నారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు తగ్గించేలా కుట్ర జరగడంతో జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం జరగనుందన్నారు. సమావేశంలో జాగృతి షాద్‌నగర్ ఇన్‌చార్జి చీమల రమేష్, నాయకులు చలసాని విష్ణుమూర్తి, నాగని ప్రకాష్ పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం


