నిబంధనలు పాటించకుంటే చర్యలు
మొయినాబాద్/మొయినాబాద్ రూరల్: ఎరువుల విక్రయంలో నిబంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) ఉష హెచ్చరించారు. బుధవారం మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. డీలర్ల వద్ద ఉన్న ఎరువులు, యూరియా నిల్వలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షాపుల్లో స్టాక్, ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ఎరువులను ఎంఆర్‌పీ ధరలకు విక్రయించాలని, అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరగాలని సూచించారు. త్వరలోనే ఎరువుల యాప్ ప్రారంభం కానుందని తెలిపారు. రైతుల సౌకర్యం కోసం ప్రతి విక్రయ కేంద్రంలో వాలంటీర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. యాప్ ద్వారా సులభంగా ఎరువులను పొందవచ్చన్నారు. కొత్త విధానానికి డీలర్లు సహకరించాలని కోరారు. ఆమె వెంట ఏఓ అనురాధ ఉన్నారు. అంతకుముందు పీఏసీఎస్ కార్యాలయాన్ని పరిశీలించి ఎరువుల నిల్వలపై ఆరా తీశారు.
డీలర్లను హెచ్చరించిన డీఏఓ ఉషా


