పర్యాటక ప్రాంతంగా మహాపిరమిడ్
కడ్తాల్: రానున్న రోజుల్లో మహేశ్వర మహాపిరమిడ్ గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ అన్నారు. మండల పరిధిలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు మంగళవారం మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్రీజీ తన జీవితాన్ని ఆధ్యాత్మికత కోసం త్యాగం చేశారని గుర్తుచేశారు. ఆయన 40 ఏళ్ల కృషి ఫలితమే ఇంత మంది పిరమిడ్ మాస్టర్లు తయారు కావడం అన్నారు. ఆనందమయ జీవనానికి ధ్యానమే మార్గమని, ధ్యానం జీవన పురోగమమనానికి ఎంతగానో దోహద పడుతుందని పిరమిడ్ స్పిరచ్యువల్ మూవ్‌మెంట్ సొసైటీస్ సభ్యురాలు, ధ్యాన గురువు పరిణిత పత్రి పేర్కొన్నారు. ధ్యానంతోనే జ్ఞానం కలుగుతుందన్నారు. ధ్యానం ద్వారా పొందిన జ్ఞానాన్ని దైనందిన జీవితంలో ఆచరించకపోతే ప్రయోజనం శూన్యమని తెలిపారు. ధ్యాన మహాయాగంలో భాగంగా ఉదయం 5 నుంచి 8 గంటల వరకు సంజయ్ కింగీ సంగీత కళాకారుల బృందం ఆధ్వర్యంలో సామూహిక ప్రాతఃకాల సంగీత ధ్యానం నిర్వహించారు. సినీ స్టంట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ సోదరులు సందడి చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ భాస్కర్‌రెడ్డి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
పర్యాటక ప్రాంతంగా మహాపిరమిడ్
పర్యాటక ప్రాంతంగా మహాపిరమిడ్


