చేప పిల్లల పంపిణీ పేరుతో కాంగ్రెస్ డ్రామా
ఎమ్మెల్యే సబితారెడ్డి
తుక్కుగూడ: చేప పిల్లల పంపిణీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు అడుతోందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితారెడ్డి అన్నారు. రావిర్యాల చెరువులో మంగళవారం ఆమె చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడు స్తుంటే ఇప్పుడు చేప పిల్లల పంపిణీ గుర్తొచ్చిందన్నారు. కులవృత్తిదారులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. చెరువులపై ఆధారపడి జీవించే మత్స్యకారుల పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా స్పందించి మత్స్యకారులు సంక్షేమం కోసం కృషి చే యాలన్నారు. అనంతరం రావిర్యాల చెరువు కట్ట వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో మత్స్యశా ఖ ఏడీ పూర్ణిమ, బీఆర్‌ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


