రైతుల అవసరం మేరకు రుణాలివ్వాలి
తుక్కుగూడ: రైతుల అవసరం మేరకు బ్యాంకర్లు రుణాలు అందించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల సాంకేతిక కమిటీలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రై తుల అవసరాలకు అనుగుణంగా,గత సంవత్సరం కంటే 25 శాతం రుణాలు పెంచాలని సూచించారు. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు పెంచాలన్నారు. జిల్లా అధికారులు కమి టీకి తమ అభిప్రాయాలు తెలిజేయాలన్నారు. సమావేశంలో డీసీబీసీ సీఈఓ భాస్కర సుబ్రహ్మణ్యం, జనరల్ మేనేజర్ ప్రభాకర్‌రెడ్డి, నాబార్డు డీడీఎం సుశీల్‌కుమార్,జిల్లా వ్యవసాయాధికారి ఉష, హార్టికల్చర్ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు మున్సిపల్, నేషనల్ హైవే, ఆర్‌అండ్‌బీ, ఆర్టీసీ అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, వాటి నియంత్రణ, భద్రత కోసం చర్యలు చేపడతామన్నారు. ఇందులో ప్రజల సహకారం సైతం ఉండాలన్నారు.


