జోరుగా మొక్కజొన్న విక్రయాలు
కందుకూరు: ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. మరోవైపు మార్క్ ఫెడ్ విధించిన గడువు సమీపిస్తుండటంతో రైతులు తాము పండించిన పంటను పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ట్రాక్టర్లు, డీసీఎంలలో పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. నెల రోజుల నుంచి రైతులు కోతలు ప్రారంభించారు. నవంబర్ 14 నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను సేకరిస్తున్నారు. తేమ శాతం 14లోపు ఉంటే క్వింటాలుకు మద్దతు ధర రూ.2,400 చొప్పు న కొనుగోలు చేస్తున్నారు. మార్క్‌ఫెడ్ మొదట ఈనెల 15వ తేదీ వరకు మాత్రమే కొనుగోలు చేయడానికి గడువు విధించింది. తర్వాత పంట ఇంకా పొలాల్లోనే ఉండడంతో 30వ తేదీ వరకు పొడిగించింది. ప్రస్తుతం చాలా మంది రైతుల పంట ఇంకా కోతలు చేపట్టాల్సి ఉంది. ఉన్న సమయం సరిపోద ని మరో పదిహేను రోజులు పొడిగించాలని రైతు లు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ప్రారంభంలో క్వింటాల్‌కు రూ.1,800 వరకు, ప్రస్తుతం రూ.1,900 నుంచి రూ.1,950 వరకు ధర పలుకుతోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.


