సర్ధార్‌నగర్‌ను సందర్శించిన రష్యా బృందం
షాబాద్: మండల పరిధిలోని సర్ధార్‌నగర్ పశువుల సంతను రష్యా పశువైద్యుల బృందం మంగళవా రం సందర్శించింది. సంతలో పశువుల క్రయవిక్రయాలు, వైద్యం వంటి విరాలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. పశువుల నాణ్యత, అల్కబీర్ కంపెనీ మాంసం ఎగుమతులపై ఆరా తీశారు. పశువులకు వైద్యం ఎలా చేస్తున్నారు అనే విషయాలను పరిశీలించారు. వారికి మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్‌రెడ్డి, రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి క్లుప్తంగా వివరించారు. అనంతరం వారు షాబాద్ పశువైద్యశాలను సందర్శించారు. పుశువులకు రోగాలు వస్తే వైద్యం చేసేందుకు ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.


