బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు నిరసన
హుడాకాంప్లెక్స్: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న మారణహోమాన్ని నిరసిస్తూ మంగళవారం విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని ఆధ్వర్యంలో కొత్తపేట చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. జిహాదీ శక్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ నేతలు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉన్న కేంద్ర రక్షణ రంగ సంస్థల చుట్టూ రోహింగ్యాలు అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పెద్ద సంఖ్యలో ఇక్కడ శాశ్వతంగా నివాసాలు ఏర్పర్చుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థత, నిఘా లేకపోవడంతోనే అక్రమ వలసలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ఇప్పటికై నా అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మాట్లాడుతూ.. బాధిత హిందువులకు న్యాయం చేయాలని, అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.


