మైసిగండి ఆలయంలో వేలం
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయ ప్రాంగణంలో ఏడాది కాలానికి కొబ్బరి చిప్పలు, వడిబియ్యం, చీరలు సేకరించుటకు హక్కులకు మంగళవారం ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. ఇందులో ముగ్గు రు వ్యక్తులు పాల్గొనగా మైసిగండి గ్రామానికి చెందిన కేతావత్ పరంసింగ్ అత్యధికంగా రూ.13.97 లక్షలకు సేకరణ హక్కులను సొంతం చేసుకున్నా రు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ కార్య నిర్వాహణాధికారి మురళీకృష్ణ, ఫౌండర్ ట్రస్టీ శిరోలీ, ఈవో స్నేహలత, నిర్వాహకులు భాస్కర్ నా యక్, ఉప ప్రధాన అర్చకులు యాదగిరిస్వామి, సిబ్బంది కృష్ణ, చంద్రయ్య, రాములు, శ్రీనివాసులు, శ్రవణ్‌కుమార్, హర్షవర్ధన్ తదితరులు ఉన్నారు.
ఆ భూములు ఆలయానివే..
తీర్పు వెల్లడించిన హైకోర్టు
చేవెళ్ల: మండలంలోని మల్కాపూర్ పరిధిలోని దేవాలయ భూములు తమవేనంటూ కొందరు వ్యక్తులు హైకోర్టులో వేసిన కేసును మంగళవారం న్యాయస్థానం కొట్టేసింది. ఈ భూములు చేవెళ్ల శ్రీబాలాజీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయానికే చెందుతాయని ఆర్డర్ ఇచ్చింది. ఆలయ ఈఓ నరేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మల్కాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 10, 18, 20, 22, 24, 29, 31, 33, 127, 140, 141, 230, 238, 273, 275, 366/అ, 366/ఆ లలో మొత్తం 79.02 ఎకరాల ఆలయ భూమి ఉంది. మల్కాపూర్‌కు చెందిన పలువురు కొన్నేళ్లుగా ఇందులో సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మారడంతో ఈ భూములు తమవేనంటూ మల్కాపూర్‌కు చెందిన శేరి నారాయణరెడ్డితోపాటు మరో 14 మంది 2007లో హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన (కేసు నంబర్ డబ్ల్యూపీ 9786/2007) ధర్మాసనం సదరు భూములు శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికే చెందుతాయని తీర్పునిచ్చింది. నారాయణరెడ్డితో ఇతరులు వేసిన కేసును కొట్టేసింది. ప్రస్తుతం ఈభూమి మార్కెట్ విలువ సుమారు రూ.100 కోట్లకు పైగా ఉంటుంది. కోర్టు ఆదేశంతో సదరు భూములను స్వాధీనం చేసుకుంటామని ఈఓ తెలిపారు.


