సెమీ క్రిస్మస్ వేడుకలు షురూ
మొయినాబాద్: క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. మంగళవారం మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలోని మెథడిస్ట్ చర్చీలో సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. మెథడిస్ట్ జిల్లా అధికారి పి.విజయరావు అధ్యక్షతన జరిగిన వేడుకలకు హైదరాబాద్ రీజియన్ కాన్ఫరెన్స్(హెచ్‌ఆర్సీ) బిషప్ ఎ.సిమెయోన్ ముఖ్యఅతిథిగా హాజరై లోక రక్షకుడు క్రీస్తు మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని సూచించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేడుకల్లో హెచ్‌ఆర్‌సీ ట్రెజరర్ డి.రాజు, ఆర్‌ఈబీ సభ్యుడు ప్రవీణ్, యూత్ అధ్యక్షుడు ప్రణయ్‌కుమార్, సికింద్రాబాద్ డీఎస్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సెమీ క్రిస్మస్ వేడుకలు షురూ


