విద్యా సదస్సుకు తరలిరండి
కడ్తాల్: జనగామ జిల్లా కేంద్రంలో ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును జయప్రదం చేయాలని ఈ సంఘం జిల్లా కార్యదర్శి శంకర్‌నాయక్, మండల అధ్యక్షుడు జంగయ్య కోరారు. ఈ మేరకు మండల కేంద్రంలో విద్యా వనరుల కేంద్రంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో గోడ పత్రికను మంగళవారం ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 28న ఉదయం జనగామలోని నెహ్రూ పార్కు నుంచి మాంగళ్య ఫంక్షన్‌హాల్ వరకు ఉపాధ్యాయుల మహాప్రదర్శన ఉంటుందని తెలిపారు. సమావేశాల్లో విద్యారంగ సమస్యలపై తీర్మానాలు చేసి, భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, అరుణ, కోశాధికారి నర్సింహమూర్తి, రాజు, రవి, రహీం, పాషా తదితరులు పాల్గొన్నారు.
టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శంకర్‌నాయక్


