కేవీ కేంద్రాలతో లాభాల సాగు
మాడ్గుల: వ్యవసాయంలో అధిక లాభాలు ఆర్జించేలా కృషి విజ్ఞాన కేంద్రాలు ఆధునిక పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల వద్దకు చేరుస్తున్నాయని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధకులు, శాస్త్రవేత్త డా.చంద్రకాంత్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతు వేదికలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు దినోత్సవం సందర్భంగా భారతరత్న మాజీ ప్రధాని చౌధరీ చరణ్‌సింగ్ జయంతిని నిర్వహించారు. అనంతరం శాస్త్రవేత్త డా.చంద్రకాంత్ మాట్లాడుతూ.. కృషి విజ్ఞాన కేంద్రాల సాయంతో సేంద్రియ సాగు పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తోందన్నారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కేంద్రీయ మెట్ట వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్లు శీకృష్ణ, రజిత, గౌతమ్ చౌహాన్, దిలీప్, ఏఓ అరుణకుమారి, కేవీకే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


