పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి
శంకర్‌పల్లి: ఆశా కార్యకర్తలకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆశా కార్యకర్తలతో కలిసి శంకర్‌పల్లి సీహెచ్‌ఓకి వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశా కార్యకర్తలను చిన్న చూపు చూస్తోందని, ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. వివిధ సర్వేలు, ఎన్నికల విధులు తదితర వాటికి వినియోగించుకోని గౌరవ భత్యం చెల్లించకపోవడం దారుణమన్నారు. అదే విధంగా ఆశాలకు రూ.18 వేల కనీస వేతనం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ బోడ మల్లేశ్, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు నాగమణి, కార్యదర్శి భవాని, కోశాధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్


