అభివృద్ధికి కేంద్ర నిధులు
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
మొయినాబాద్‌రూరల్: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం సర్పంచ్‌ల ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా శ్రీరామ్‌నగర్, బాకారం, రెడ్డిపల్లి గ్రామాలలో బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్‌నగ ర్ సర్పంచ్ గీతామైపాల్, ఉపసర్పంచ్ సుమలతమెన్‌రెడ్డి, బాకారం సర్పంచ్ వెంకటేశ్‌గౌడ్, మాణిక్యం, ఎంపీడీఓ సంధ్య, ఎంపీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ గౌతమ్‌కుమార్, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


