రక్షణ చట్టం కోసం పాదయాత్ర
ఆమనగల్లు: న్యాయవాదుల రక్షణ కోసం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆమనగల్లు బార్ అసోసియేషన్ ఈ నెల 22 నుంచి సచివాలయం ముట్టడి, పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు యాదీలాల్ తెలిపారు. శుక్రవారం ఆమనగల్లు కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల న్యాయవాదులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం రూపకల్పన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 4 ప్రధాన డిమాండ్‌లతో ఆమనగల్లు నుంచి ప్రారంభించి హైదరాబాద్‌లోని సచివాలయం వరకు నిర్వహిస్తామని ఆయన వివరించారు.
పాదయాత్ర వివరాలు..
ఈ నెల 22న ఉదయం 11 గంటలకు ప్రారంభించి ఆమనగల్లు నుంచి కందుకూరు వరకు మొదటిరోజు పాదయాత్ర నిర్వహిస్తామని యాదీలాల్ తెలిపారు. రెండవరోజు కందుకూరు నుంచి తుక్కుగూడ వరకు, మూడో రోజు తుక్కుగుడ నుంచి సచివాలయం వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి ఆంజనేయులు యాదవ్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి విజయ్‌కుమార్, కోశాధికారి కృష్ణ, గ్రంథాలయ కార్యదర్శి మల్లేశ్, క్రీడా కార్యదర్శి శేఖర్, సీనియర్ న్యాయవాదులు లక్ష్మణశర్మా, మల్లెపల్లి జగన్, మల్లేశ్, మధుగౌడ్, గణేశ్‌గౌడ్, జగన్, సంతోశ్, శిరిష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదీలాల్


