
మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు
శంకర్‌పల్లి: మండలంలోని చెందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు మరకత శివాలయాన్ని సోమవారం విశ్రాంత ఐఏఎస్ శరత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శరత్ దంపతులు లింగానికి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరకత శివాలయాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం ఆలయ నిర్వాహకులు శరత్ దంపతులకి జ్ఞాపిక, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ గౌరవాధ్యక్షుడు సదానందం, సభ్యులు హనుమంతు, అర్చకులు ప్రమోద్, వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభించండి
షాద్‌నగర్: ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభించాలని కోరుతూ సోమవా రం మండల పరిధిలోని మొగిలిగిద్ద గ్రామస్తు లు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాంతో వెళ్లి రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసారు. గ్రామంలోని ప్ర భుత్వ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవా నికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారని, పాఠశా ల అభివృద్ధికి రూ.10కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. పనులు నేటికీ ప్రారంభం కాలేదని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల నుంచి 11 మంది ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌పై వెళ్తున్నారని, డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని కోరారు. స్పందించిన కమిషనర్ పాఠశాలను సెప్టెంబర్ 1న సందర్శిస్తా మని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. కమిషనర్‌ను కలిసిన వారిలో శ్యాంసుందర్, దయాసాగర్, బాబు తదితరులు ఉన్నారు.
ఉప్పొంగి ప్రవహిస్తున్న
ఈసీ వాగు
మొయినాబాద్‌రూరల్: మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈసీ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద ప్రవాహం పెరుగుతోంది. చేవెళ్ల, షాబాద్ మండలాల మీదుగా మొయినాబాద్ మండలాన్ని తాకుతూ నక్కలపల్లి, అమ్డాపూర్, బాకారం ప్రాంతాల మీదుగా ప్రవహిస్తూ హిమాయత్‌సాగర్‌లోకి చేరుతోంది. అమ్డాపూర్ సమీపంలో పంటపొలాల నుంచి జోరుగా ప్రవహిస్తోంది.
హనుమంతుడి
చరిత్ర స్ఫూర్తి మంత్రం
చేవెళ్ల: హనుమంతుడి చరిత్ర ప్రపంచానికి స్ఫూర్తి మంత్రమని త్రిదండి అహోబిల పీఠాధిపతి రామానుజ జీయర్‌స్వామి అన్నారు. మండలంలోని తంగడపల్లిలో ఆరు రోజులుగా కొనసాగుతున్న అభయాంజనేయ స్వామిఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, నాగదేవతల విగ్రహ ప్రతిష్ఠ, నాబిశిల ప్రతిష్ఠ ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు రామానుజ జీయర్‌స్వామి హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. హనుమంతుని గుడి లేని ఊరు ఉండదని పేర్కొన్నారు. యువత హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలని, దేశ రక్షణ, ధర్మ రక్షణ కోసం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు, పీఏసీఎస్ చైర్మన్‌లు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు

మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు

మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు