
చల్లంగ చూడమ్మ.. పోచమ్మ తల్లి
బోనాల ఊరేగింపులో కళాకారుల ప్రదర్శన
ఊరేగింపులో ఉత్సాహం
కడ్తాల్ మండల పరిధిలో సోమవారం పోచమ్మ బోనాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రభల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. పూజల్లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి తదితరులు పాల్గొన్నారు.
– కడ్తాల్

చల్లంగ చూడమ్మ.. పోచమ్మ తల్లి