
మొయినాబాద్ కమిషనర్‌పై చర్యలు తీసుకోండి
మొయినాబాద్: జాతీయ జెండాను అవమనించేలా వ్యవహరించిన మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. అజీజ్‌నగర్‌లోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ వినోద్‌కు వినతిపత్రం అందించారు. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ ఖాజామోయిజుద్దీన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు జాతీయ జెండాను అవమానించే విధంగా వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. వార్డు కార్యాలయలపై ఎందుకు జెండా ఎగురవేయలేదని అడిగినందుకు దురుసుగా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. ఇలాంటి అధికారులు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు అంజన్‌కుమార్‌గౌడ్, జిల్లా నాయకుడు ఎన్.ప్రభాకర్‌రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన
కలెక్టర్ ఆగ్రహం!
మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్‌పై కలెక్టర్ నారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆర్డీఓ నివేదికను పరిశీలించిన కలెక్టర్ సోమవారం కమిషనర్‌ను తన కార్యాలయానికి పిలిపించి చీవాట్లు పెట్టినట్టు సమాచారం. ప్రజలతో ఎలా మాట్లాడాలో తెలియదా.. ఏదైనా సమస్య తలెత్తితే నచ్చజెప్పి సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి దురుసుగా ప్రవర్తించి వివాదం సృష్టిస్తావా అంటూ తీవ్ర స్థాయిలో మందలించినట్టు తెలిసింది. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.