
రైతులందరికీ రుణమాఫీ చేయాలి
తుర్కయంజాల్: రైతులందరికీ వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో పాటు, రుణమాఫీ చేయాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం టెస్కాబ్‌వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాధవరెడ్డి మాట్లాడుతూ.. క్రాప్ లోన్, ఎల్‌టీ లోన్ పెంచాలని, 55 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు పింఛన్ ఇవ్వాలని కోరారు. రైతులకు కల్తీ లేని నాణ్యమైన విత్తనాలు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు ఎస్.బాల్ రెడ్డి, జంగారెడ్డి, బాలరాజు, బాలయ్య, శ్రీనివాస్, ప్రణీత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారత్ సమ్మిట్‌లో
షాద్‌నగర్ ఎమ్మెల్యే
షాద్‌నగర్: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. పెట్టుబడులు, న్యాయం, అహింస, ప్రపంచ శాంతి లక్ష్యంగా ప్రభుత్వం భారత్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నట్‌రాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు తదితరులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కలిశారు.
భూ భారతిపై నందిగామలో అవగాహన సదస్సు నేడు
నందిగామ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతిపై మండల కేంద్రంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ రాజేశ్వర్ తెలిపారు. అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలోని ప్రిన్స్ ప్యాలెస్ ఆవరణలో మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కలెక్టర్ నారాయణ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నట్లు చెప్పారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని సూచించారు.
తుర్కయంజాల్ ఇన్‌చార్జి కమిషనర్‌గా రవీందర్ రెడ్డి
తుర్కయంజాల్: మున్సిపల్ కమిషనర్ కె.అమరేందర్ రెడ్డి పది రోజుల పాటు సెలవులో వెళ్లారు. దీంతో పెద్ద అంబర్‌పేట కమిషనర్ ఎస్.రవీందర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టి.శ్రీదేవి ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో రవీందర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
జిల్లా జడ్జికి సత్కారం
ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన కరుణకుమార్‌ను ఆమనగల్లు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదీలాల్ ఆధ్వర్యంలో ఆయనను కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో సభ్యులు విజయ్‌కుమార్, కృష్ణ, గణేశ్, ఆంజనేయులు, శిరీష్, బిక్యానాయక్ తదితరులు ఉన్నారు.

రైతులందరికీ రుణమాఫీ చేయాలి

రైతులందరికీ రుణమాఫీ చేయాలి