రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి, సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల
ఆమనగల్లు: రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఆకుతోటపల్లిలో గురువారం కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ అభియాన్‌లో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. అంతకుముందు గ్రామంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ జీవీ వెన్నెల, మార్కెట్ చైర్‌పర్సన్ యాట గీత, పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి బుదిధ చెప్పడానికి ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ జీవీ వెన్నెల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. అనంతరం రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జగన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్, పట్టణ అధ్యక్షుడు మానయ్య, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శి ఫరీద్, మాజి ఎంపీపీ విజయ్ తదితరులు పాల్గొన్నారు.


