హక్కుల సాధనకు పోరాడుదాం
షాద్‌నగర్: హక్కుల సాధనకు కార్మికులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు పిలుపునిచ్చారు. పట్టణంలోని యమ్మి హోటల్‌లో ఆదివారం తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఈ నెల 21, 22వ తేదీల్లో శంషాబాద్‌లో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో నాయకులు శ్రీను, చంద్రబాబు, లింగంనాయక్, గోవింద్ నాయక్, జంగయ్య, రమేశ్, రాజునాయక్, శంకర్, పవన్ చౌహాన్, ఆకాశ్ పాల్గొన్నారు.
వలస కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి
కొత్తూరు: జీవనోపాధి కోసం ఆయా రాష్ట్రాల నుంచి షాద్‌నగర్‌కు వచ్చిన వలస కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి పానుగంటి పర్వతాలు కోరారు. కొత్తూరు పట్టణంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఈ నెల 21, 22న శంషాబాద్‌లో నిర్వహించనున్న భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులను పరిశ్రమల నిర్వాహకులు, కాంట్రాక్టర్లు శ్రమ దోపిడీకి గురిచేస్తున్నట్లు ఆరోపించారు. వెంటనే ప్రభుత్వాలు స్పందించి వలస, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహారెడ్డి, శేఖర్‌రెడ్డి, షకీల్, జంగయ్య, సంజీవ, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతాలు


