పెండింగ్ వేతనాలు చెల్లించండి
షాద్‌నగర్: గ్రామ పంచాయితీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జీపీ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంల ఆవరణలో ఎంపీడీఓ బన్సీలాల్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ... పంచాయతీ కార్మికులకు రెండు నెలల వేతనాలను మాత్రమే కార్మికుల ఖాతాలలో వేశారని, మరో మూడు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించడంతో పాటుగా పర్మినెంట్ గుర్తింపు కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ బన్సీలాల్ మాట్లాడుతూ.. డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని, మా పరిధిలోని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా రు. వినతిపత్రం ఇచ్చిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగయ్య, నా యకులు రాజునాయక్, శంకర్‌నాయక్, జీపీ కార్మికులు తదితరులు ఉన్నారు.
జీపీ వర్కర్స్ యూనియన్‌రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి


