టీవీ రంగయ్యకు ఉగాది పురస్కారం
షాద్‌నగర్: నగరంలోని అమీర్‌పేట కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అక్కినేని నాగేశ్వర్‌రావు శతజయంతి సందర్భంగా ఆంధ్ర నాటక కళాపరిషత్ 96వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలో కళారంగానికి అత్యుత్తమ సేవలను అందిస్తున్న పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు టీవీ రంగయ్యను ఉగాది పురస్కారంతో సన్మానించారు. కిమ్స్ ఆస్పత్రి అధినేత బొల్లినేని కృష్ణయ్య, కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేక రామకృష్ణ, ప్రధానకార్యదర్శి అన్నమనేని ప్రసాద్ చేతుల మీదుగా ఆయన ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం టీవీ రంగయ్య మాట్లాడుతూ.. ఆంధ్రనాటక కళాపరిషత్‌లో ఏఎన్‌ఆర్, ఎన్టీఆర్ లాంటి ఎందరో ప్రముఖ నటులు ప్రదర్శనలు ఇచ్చారని అన్నారు. అలాంటి సంస్థ తన సేవలను గుర్తించి పురస్కారాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. పురస్కారానికి ఎంపిక చేసిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా కళాభిమానులు రంగనాథం, బెజుగం రమేష్, వడ్ల రమేష్‌చారి, సింగారం శ్రీనివాస్, నారాయణచారి, మల్లికార్జునగౌడ, సత్యనారాయణ, బాలబ్రహ్మచారి, సుధాకర్ తదితరులు ఆయన్ను అభినందించారు.


