తుర్కయంజాల్: షార్ట్ సర్క్యూట్‌తో స్కూల్ బస్‌లో మంటలు చెలరేగిన ఘటన సాగర్ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నాదరగ్‌గుల్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు (టీజీ08 యూ1796) ఇంజాపూర్‌లో విద్యార్థులను దింపేసి, తిరిగి వెళ్తుండగా గుర్రంగూడ వద్ద డ్రైవర్ సీటు కిందినుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సు దిగి, తోటి వాహనదారుల సహాయంతో మంటలను ఆర్పేసే ప్రయత్నం చేయడంతో పాటు ఫైరిజింన్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో సాగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
● విద్యార్థులను దింపేసి వస్తుండగా ఘటన
● సాగర్ రహదారిపై ట్రాఫిక్ జామ్