ముగిసిన పత్రీజీ ధ్యాన మహాయాగం
కడ్తాల్: మండల కేంద్ర సమీపంలోని కై లాసపురి మహేశ్వర మహాపిరమిడ్ క్షేత్రంలో పదకొండు రోజుల పాటు కొనసాగిన పత్రీజీ ధ్యాన మహాయాగం వేడుకలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా గురుమాత స్వర్ణమాల పత్రి ప్రసంగిస్తూ.. పత్రీజీ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని సూచించారు. ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. ధ్యాన సంబురాలను విజయవంతం చేసిన ప్రతీ పిరమిడ్ మాస్టర్‌కు, ధ్యానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ధ్యానులందరికి నూతన సంవత్సర సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 డిసెంబర్‌లో పత్రీజీ మౌన ధ్యాన మహాయాగం మరింత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంతరం పిరమిడ్ ట్రస్ట్ సభ్యులను, ధ్యాన గురువులను, మాస్టర్లను, సంగీత విధ్వాంసులను, కళాకారులను, ట్రస్ట్ చైర్మన్, సభ్యులతో పాటు పరిణిత పత్రి ఘనంగా సన్మానించారు. సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు దాట్ల హన్మంతరాజు, సభ్యులు దామోదర్‌రెడ్డి, శ్రీరాంగోపాల్ హనమంతరావు, మాధవి, లక్ష్మి, నిర్మల, బాలకృష్ణ, సాగర్, శివప్రసాద్ ఉన్నారు.
ఈ ఏడాది మౌనధ్యాన మహాయాగం
ముగిసిన పత్రీజీ ధ్యాన మహాయాగం


