అబ్దుల్లాపూర్‌మెట్: ెపద్దఅంబర్‌పేట పురపాలక సంఘంలో ఈ సంవత్సరం రూ.19.59 కోట్లు పన్నుల వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రూ.7.50 కోట్లు (47 శాతం) వసూలు చేశారు. వంద శాతం వసూలు లక్ష్యంగా ఆస్తి, నల్లా పన్నులు వసూళ్లు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. గడువులోగా లక్ష్యాన్ని చేరుకుంటామని కమిషనర్ రవీందర్‌రెడ్డి తెలిపారు. పన్నుల వసూళ్లకు వార్డుల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, నిత్యం వార్డుల్లో పర్యటిస్తూ వసూలు చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. పట్టణ ప్రజలు, వ్యాపారులు సరైన సమయానికి పన్నులు చెల్లిస్తూ ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.