మహేశ్వరం: అక్రమంగా మట్టి తరలిస్తున్న మాఫియాపై పోలీసులు కేసు నమోదు చేసి నాలుగు వాహనాలను సీజ్ చేశారు. ఈ ఘటన మండల పరిధిలోని గంగారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని గంగారం సర్వే నంబర్ 85లో ఉన్న ప్రభుత్వ భూమిలో కబ్జాలో ఉన్న గ్రామస్తుడు మునావత్ రెడ్యానాయక్‌కు డబ్బులిచ్చిన కట్రావత్ లక్ష్మణ్, మునావత్ నగేశ్, మునావత్ రాజేశ్ మట్టి తవ్వకాలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున దాడి చేసి మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేశారు. మట్టిని విక్రయించిన వ్యక్తితో పాటు లక్ష్మణ్, నగేశ్, రాజేశ్, వారి టిప్పర్ డ్రైవర్లు మెగావత్ రాజు, జెటావత్ తుల్చానాయక్, సందీప్ కుమార్ దాస్, మునావత్ కృష్ణం రాజుపై కేసు నమోదు చేశారు. మూడు టిప్పర్లు, ఓ ఇటాచీ వాహనాన్ని సీజ్ చేశారు.
మూడు టిప్పర్లు, జేసీబీ సీజ్
ఎనిమిది మందిపై కేసు