ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు | - | Sakshi
Sakshi News home page

ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు

Mar 20 2025 7:56 AM | Updated on Mar 20 2025 7:56 AM

ఇంటి

ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు

షాద్‌నగర్‌ డీఎం ఉష

షాద్‌నగర్‌రూరల్‌: శ్రీరామ నవమిని సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యా ణ తలంబ్రాలను కావాల్సిన భక్తులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని డీఎం ఉష బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేర్చేందుకు ఆర్టీసీ నిర్ణయించిందని.. తలంబ్రాలు కావాల్సిన భక్తులు రూ.151 చెల్లించి బస్టాండ్‌ ఆవరణలోని కార్గో కేంద్రంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

ఆశలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ప్రతీ నెల రూ.18 వేల వేతనం ఇవ్వాలి

సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కిషన్‌

కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నా

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రతీ నెల రూ.18 వేల వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్‌, ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు కవిత డిమాండ్‌ చేశారు. ఆశ వర్కర్ల సమస్యల పరిష్కరించాలని.. బడ్జెట్‌ సమావేశాల్లో తగిన కేటాయింపులు చేయాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కిషన్‌, కవిత మాట్లాడుతూ.. ఏఎన్‌ఎం శిక్షణ పూర్తి చేసిన ఆశలకు ఏఎన్‌ఎం పోస్టుల్లో ప్రమోషన్లు కల్పించాలని కోరారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు, జూలై 30న, డిసెంబర్‌ 10, ఫిబ్రవరి 9న ఆరోగ్య కమిషనర్‌ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. 2021 జూలై నుంచి డిసెంబర్‌ 6 వరకు ఆరు నెలల పీఆర్సీ, ఏరియర్స్‌ వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పనిభారం తగ్గించి.. పారితోషికం లేని పనులు చేయించకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సాయిబాబా, రుద్రకుమా ర్‌, జిల్లా నాయకులు బుట్టి బాల్‌రాజ్‌, కృష్ణ, పెంటయ్య, ఆశ యూనియన్‌ జిల్లా నాయకు లు రాధిక, కవిత, అనిత, జహంగీర్‌, నీలమ్మ, నిర్మల, కవిత, అనిత, చంద్రకళ, సుశీల, జయసుధ, సరస్వతి పాల్గొన్నారు.

త్వరలో పెండింగ్‌బిల్లులు విడుదల

సమస్యల పరిష్కారానికి చర్యలు

సీఐటీయూ నాయకులతో జిల్లా విద్యాధికారి సుశీంధర్‌రావు

ఇబ్రహీంపట్నం రూరల్‌: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్‌ బిల్లులు వీలైనంత త్వరగా వచ్చేలా చూస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధర్‌రావు హామీ ఇచ్చారు. బుధవారం సీఐటీయూ నాయకులు, మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలపై కలెక్టర్‌ నారాయణరెడ్డికి వినతిపత్రం ఇవ్వడంతో ఆయన వెంటనే డీఈఓతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ మేరకు సుశీంధర్‌రావు వారితో సమావేశమయ్యారు. మధ్యాహ్న భోజనం పథకం యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న కార్మికుల సమస్యలను డీఈఓకు వివరించారు. ఎనిమిది నెలల బిల్లులు, మూడు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కొన్ని మండలాల్లో ఉదయం టిఫిన్‌ బిల్లులు అందలేదని.. మరికొన్ని పాఠశాలల్లో మెనూ జావాలేనప్పటికీ హెచ్‌ఎంలు బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచి బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్‌ క్లాసులు నిర్వహిస్తున్నప్పుడు హెచ్‌ఎంలకు ముందుగా స్నాక్స్‌ బిల్లులు అందినా వేరే వారితో స్నాక్స్‌ పెట్టిస్తున్నారని చెప్పారు. పాఠశాలలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని కోరారు. ఈ సమావేశంలో శ్రామిక మహిళా కన్వీనర్‌ కవిత, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్‌, కిషన్‌, సాయిబాబా, జిల్లా నాయకులు కృష్ణ, పెంటయ్య, శేఖర్‌, బాలరాజు, అలివేలు, గణేశ్‌, సరిత, శిరీష, లావణ్య, పద్మ, లక్ష్మమ్మ పాల్గొన్నారు.

ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు 1
1/1

ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement