
అపరిశుభ్రంగా రోడ్లు
తుక్కుగూడ: పురపాలక సంఘం పరిధిలోని తుక్కుగూడ నుంచి బాసగూడతండాకు వెళ్లే రోడ్డు, రావిర్యాల నుంచి ఆర్‌సీఐ రోడ్డు, ఔటర్ రింగు సర్వీసు రోడ్లు పూర్తిగా అపరిశుభ్రంగా మారాయి. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, ప్లాస్టిక్ కాగితాలు పేరుకుపోయాయి. అధికారులు స్వచ్ఛ వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలను ఉపయోగించి గృహాలు, వ్యాపార సముదాయులు, పరిశ్రమల నుంచి రోజుకు 9 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇలా సేకరించినప్పటికీ నగరం నుంచి రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు, కొంత మంది స్థానికులు చెత్తను తెచ్చి ప్రధాన రోడ్లపై వేస్తున్నారు. ఇందులో జంతు వ్యర్థాలు సైతం ఉంటున్నాయి. చెత్తను ఆరుబయట వేయకుండా అవగాహన కల్పించాలని, చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానా విధించాలని స్థానికులు కోరుతున్నారు.