
ఎమ్మెల్యేకు మద్దతు తెలిపి సన్మానిస్తున్న న్యాయవాదులు
షాద్‌నగర్: న్యాయవాదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్‌రావు ఆధ్వర్యంలో అడ్వకేట్స్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా పట్టణంలోని బీఆర్‌ఎస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయవాదులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ... రాష్ట్ర సాధన ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. న్యాయవాదుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. ఈ ఎన్నికల్లో న్యాయవాదులు బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడం హర్షనీయమని అన్నారు. బార్ అసోసియోషన్ అద్యక్షుడు వేణుగోపాల్‌రావు, మాజీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాద వ్యవస్ధను అన్ని విధాలుగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. స్వరాష్ట్రంలో న్యాయవాదులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, రఘునాథ్‌శర్మ, దేశికాచారి, సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, బాల ప్రసాద్, నర్సింలు, విజయ్‌కుమార్, నర్సింలు, శేఖర్, సురేందర్, జయమ్మ, శ్వేత, చంద్రశేఖర్ యాదవ్, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ షాద్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్