వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రాళ్లరామన్నపేటకు చెందిన సింగిరెడ్డి రాజిరెడ్డి గతంలో ‘సింగిరెడ్డి శతకం’, ‘రామ శతకం’ రచించారు. తాజాగా సమాజంలోని వాస్తవాలను కళ్లకు కడుతూ స్వామివారికి తన అంతరంగాన్ని విన్నవించుకునే రీతిలో తన మూడో రచన ‘నీలకంఠ శతకం’ పూర్తి చేసి శుక్రవారం ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేదపండితులు రాజిరెడ్డికి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, డీఈ రఘునందన్ స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు.
రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్
పోటీలు ప్రారంభం
కరీంనగర్‌స్పోర్ట్స్: 70వ తెలంగాణ రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్–17 బాలబాలికల బాస్కెట్‌బాల్ పోటీలు శుక్రవారం కరీంనగర్‌లోని సెయింట్ ఆల్ఫోన్స్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమయ్యాయి. పోటీలకు పాత పది జిల్లాల నుంచి 250 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. ఉదయం ఈ పోటీలను కరీంనగర్ డీఈవో తిరుపతిరావు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల క్రీడా భవిష్యత్తుకు పునాదులు వేస్తాయన్నారు. డీసీఈబీ కార్యదర్శి బలవంతయ్య, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎల్.బన్సీ లాల్, బాబు శ్రీనివాస్, ఆడేపు శ్రీనివాస్, అంతటి శంకరయ్య, చిరుత శ్రీనివాస్, వంగపల్లి సూర్యప్రకాశ్, బిట్ర శ్రీనివాస్, డి.సత్యానంద్, జీవన్, భార్గవ్, దత్తాత్రీ, వీర్‌పాల్, చిరంజీవి, రామానందతీర్థ, వివిధ జిల్లాల క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు, పీఈటీలు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
గంభీరావుపేట: రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజేశ్వర్‌రావునగర్ శివారులో జరి గిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని సముద్రలింగాపూర్‌కు చెందిన సయ్యద్ జావిద్ హుస్సేన్(35) దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలి పిన వివరాలు. జావిద్ హుస్సేన్ గురువారం రాత్రి మరొకరితో కలిసి బైక్‌పై సముద్రలింగాపూర్ వస్తుండగా రాజేశ్వర్‌రావునగర్ శివారులో రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడ్డ జావిద్ హుస్సేన్‌ను తొలుత ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలరాజు తెలిపారు. మృతుడు జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లి వచ్చాడు. మృతుని తండ్రి వాజీద్‌హుస్సేన్ స్థాని కంగా ఆర్‌ఎంపీగా సేవలందిస్తున్నాడు. ఎలాంటి లైట్లు, హెచ్చరిక బోర్డుల్లేకుండా నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నిలిపి ఉంచడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. రోడ్లపై హెచ్చరిక బోర్డుల్లేకుండా, రేడియం స్టిక్కర్లు లేకుండా నిలిపితే చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.


