ముందే బిల్లులు పెట్టాలట! | - | Sakshi
Sakshi News home page

ముందే బిల్లులు పెట్టాలట!

Nov 14 2026 12:17 AM | Updated on Nov 14 2026 12:17 AM

● 15లోపు వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ● బిల్లులు సమర్పిస్తేనే రెండో విడత నిధులు

● 15లోపు వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ● బిల్లులు సమర్పిస్తేనే రెండో విడత నిధులు

గంభీరావుపేట: ఎవరైనా ఖర్చు చేసిన తర్వాతే బిల్లులు పెట్టడం సాధారణం. కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం తర్వాత ఖర్చు చేసిన ఫరువాలేదు కానీ.. ముందస్తుగా బిల్లులు సమర్పించాలని సూచిస్తున్నారు. దీంతో బిల్లులు ఎలా పెట్టేదని ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నా రు. వాస్తవానికి పాఠశాలలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసిన తర్వాతనే బిల్లులు సమర్పించడం సాధారణ విధానం. అయితే ప్రస్తుతం అమలవుతున్న కొత్త చెల్లింపుల విధానంలో వెండర్‌ వివరాలు సేకరించి, వారి ఖాతాల్లోనే నగదు జమచేసేలా మార్పులు చేశారు. దీంతో పాఠశాల అవసరాలకు అనుగుణంగా కొనుగోళ్లు చేయడం, బిల్లులు సమర్పించడం విషయాల్లో ప్రధానోపాధ్యాయులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంకా ఖర్చుచేయని వస్తువులకు ముందుగానే బిల్లులు ఎలా సమర్పించాలని వారు అయోమయానికి గురవుతున్నారు. ఒకవైపు గడువు, మరోవైపు రెండు విడత గ్రాంట్లు నిలిచిపోతాయానే ఆందోళనతో హెచ్‌ఎంలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు వివిధ కేటగిరీల కింద నిధులు మంజూరయ్యాయి. పాఠశాలల నిర్వహణ, క్రీడాసామగ్రి కొనుగోలు, బాలికలు, చిన్నారుల సాధికారత కార్యక్రమాల నిర్వహణకు రెండు నెలల క్రితం నిధులు మంజూరయ్యాయి.

15లోగా బిల్లులు ఇవ్వాల్సిందే..

పాఠశాలల అవసరాల కోసం కేటాయించిన నిధులను ఈనెల 15లోపు ఖర్చు చేసి సంబంధిత బిల్లులను సమర్పించాలని విద్యాశాఖ ఆదేశించడంతో హెచ్‌ఎంలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే చేసిన ఖర్చులకు బిల్లులు సమర్పించడంతోపాటు ఇంకా ఖర్చు చేయాల్సిన నిధులకూ ముందుగా బిల్లులు సిద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గడువులోగా బిల్లులు సమర్పించకపోతే రెండో విడత నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను నిర్ణీత గడువులోగా వినియోగించి ఖర్చులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. ఈనెల 15వ తేదిని గడువుగా నిర్ణయించడంతో హెచ్‌ఎంలు హడావుడి పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement