రచనల్లో రాష్ట్రస్థాయి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రచనల్లో రాష్ట్రస్థాయి ప్రతిభ

Nov 14 2026 12:17 AM | Updated on Nov 14 2026 12:17 AM

ఎల్లారెడ్డిపేట: తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహించిన పద్య రచన పోటీల్లో ఎల్లారెడ్డిపేట హైస్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థిని పసునూరి దివ్యజ్యోతి రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచింది. తాను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఉపాధ్యాయుడు అంజన్‌రెడ్డి సూచనలతో పద్య రచనలు మొ దలుపెట్టినట్లు తెలిపారు. సమాజంలో చైతన్యం తేవడమే తన లక్ష్యమన్నారు. ప్రోత్సహించిన హెచ్‌ఎం మనోహరాచారికి కృతజ్ఞతలు తెలిపారు.

కథల పోటీల్లో శ్రావణి సత్తా

ముస్తాబాద్‌: తెలంగాణ సాహిత్య అకాడమీ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కథల పోటీల్లో ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన జక్కుల శ్రావణి రాసిన కథకు తృతీయ బహుమతి లభించింది. తెలంగాణ సాహిత్య అకాడమీ బాలల ప్రపంచం పేరిట రాష్ట్రస్థాయిలో కథల పోటీలు నిర్వహింహించింది. పదో తరగతి చదువుతున్న శ్రావణి ‘పొగ మానేద్దాం’ కథ రాిసింది. పొగ తాగడం వల్ల కలిగే అనర్థాలను తన కథలో వివరించింది. శ్రావణి కథకు రాష్ట్రస్థాయిలో తృతీయ బహుమతి లభించడంపై హెచ్‌ఎం దూడం మనోహర్‌, సర్పంచ్‌ రవి, ఉపసర్పంచ్‌ రాజు, బాలసాహితీవేత్త గరిపెల్లి అశోక్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement