సిరిసిల్ల: జిల్లాలో రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిఘా ఉంచాలని ఎస్పీ మహేశ్ బీ గీతే ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలతో జిల్లాలోని రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్ల ఇళ్లకు బుధవారం రాత్రి వెళ్లి తనిఖీ చేశారు. నేర ప్ర వృత్తికి దూరంగా జీవించాలని కౌన్సెలింగ్ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డుతూ ప్రజాజీవనానికి, శాంతి భద్రతలకు విఘా తం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బైండోవర్ చేస్తామన్నారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు శ్రీనివాస్, వీరప్రసాద్, రవీందర్ ఉన్నారు.


