వీర్నపల్లి: భూముల రీసర్వేలో భాగంగా క్షేత్రస్థాయిలో సరిహద్దుల వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని గర్జనపల్లి పరిధిలోని జవహర్‌లాల్‌నాయక్ తండాలో గురువారం భూముల రీసర్వేను పరిశీలించారు. ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, తహసీల్దార్ నారాయణరెడ్డి, ఆర్‌ఐ ఉమర్, వీర్నపల్లి ల్యాండ్ సర్వేయర్ విశ్వనాథం పాల్గొన్నారు.
మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు
తంగళ్లపల్లి: శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సైకా లజిస్ట్ పున్నంచందర్ సూచించారు. మండలంలోని ఇందిరమ్మకాలనీలోని పద్మశాలి సంఘంలో గురువారం మనోవికాస సదస్సు నిర్వహించారు. మానసిక సమస్యలను ప్రా రంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలన్నారు. పని ఒత్తిడిని జయించేందుకు మద్యపానాన్ని ఆశ్రయించొద్దని, ఆత్మహత్యలు స మస్యకూ పరిష్కారం కావని స్పష్టం చేశా రు. కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయులు, సర్పంచ్ గడ్డం రచన, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు బల్ల లక్ష్మీపతి, కార్యదర్శి మా దాసు సత్యనారాయణ, గౌడ రాజమహేందర్, మాసం రాజేందర్, భోగ రంగయ్య, జెల్ల సదానందం, కొండి సంపత్ పాల్గొన్నారు.
కర్ణాటకలో పర్యటిస్తున్న ఉపాధ్యాయులు
ఇల్లంతకుంట: జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, డీఈవో, మానిటరింగ్ అధికారులు కర్ణాటకలోని పీఎంశ్రీ పాఠశాలలు సందర్శిస్తున్నారు. అక్కడ అమలు చేస్తు న్న బోధన విధానాలు తెలుసుకోనున్నారు. వీరు ఈనెల 5 నుంచి 7 వరకు మైసూర్, బెంగళూర్ ప్రాంతాలలో పర్యటించనున్నారు. జిల్లాలోని 16 పీఎంశ్రీ పాఠశాలల హెచ్‌ఎంలు, డీఈవో విద్యాసాగర్, ఏఎంవో అశోక్ వెళ్లారు. గురువారం రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ పీఎంశ్రీ పాఠశాలను సందర్శించారు. హెచ్‌ఎంలు సందీప్, బన్నాజీ, శ్రీకాంత్‌రావు, వెంకటరెడ్డి, మదన్‌లాల్ ఉన్నారు.
నిబంధనలు పాటించాలి
ఎల్లారెడ్డిపేట: దీపావళి పండుగ నేపథ్యంలో ఏర్పాటు చేసే తాత్కాలిక టపాసుల దుకాణదారులు నిబంధనలు పాటించాలని జిల్లా ఫైర్ ఆఫీసర్ నరేందర్, ఎస్సై రమేశ్‌గౌడ్ సూచించారు. మండల కేంద్రంతోపాటు వెంకటాపూర్, రాచర్లగొల్లపల్లిలోని టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసే స్థలాలను గురువారం పరిశీలించారు. గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేశ్‌గౌడ్ ఉన్నారు.
ఉద్యమకారుల హక్కులు సాధిస్తాం
సిరిసిల్లటౌన్: ఉద్యమకారుల హక్కులను సాధిస్తామని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సంఘాల జిల్లా చైర్మన్ గజ్జెల దేవరాజు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శివనగర్‌లో గురువారం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉద్యమకారుల జేఏసీ గౌరవాధ్యక్షుడు బుస్స వేణు, నాయకులు కుసుమ విష్ణు, కర్నె లక్ష్మి, తెలంగాణ వికాస సమితి జిల్లా కోఆర్డినేటర్ నడిమెట్ల శ్రీనివాస్, బొంపల్లి రవీందర్‌రావు, మాజీ కౌన్సిలర్ పత్తిపాక పద్మ, వింద్యారాణి, బండి దేవదాస్, ట్రస్మ జిల్లా అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, మామిడాల రమణ, గుజ్జె దత్తు, చాంద్‌పాషా పాల్గొన్నారు.


