సిరిసిల్లటౌన్: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరి ష్కరించే దాకా పోరాటాలు చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, ఉపాధ్యక్షుడు మూశం రమేశ్ పేర్కొన్నారు. గురువారం నుంచి కార్మికులు నిరవధిక సమ్మెకు దిగిన నేపథ్యంలో ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టి మాట్లాడారు. విధులు నిర్వహిస్తూ చనిపోయిన, రిటైర్మెంట్ పొందిన కా ర్మికుల స్థానాల్లో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోవాలని, పీఎఫ్ సమస్య పరిష్కరించాలని కోరారు. కాసారపు శంకర్, బాబా కిషన్, అర్జున్, ఉమ, లక్ష్మి, విజయ, దేవరాజు, శ్రీనివాస్ ఉన్నారు.


