సిరిసిల్ల: జిల్లాలో హైరిస్క్ గర్భిణులను ముందుగా గుర్తించి, మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో గురువారం ఏఎన్ఎంలతో సమావేశమయ్యారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. హైరిస్క్ గర్భిణులకు సంబంధిత వైద్యాధికారుల పర్యవేక్షణలో అవసరమైన చికిత్స అందేలా చూడాలని సూచించారు.
డిప్యూటీ జిల్లా వైద్యాధికారి, మాతా శిశు ఆరోగ్య కార్యక్రమ అధికారి డాక్టర్ నాగేందర్బాబు, జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ రామకృష్ణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సంపత్ పాల్గొన్నారు.


