పాపం.. పసివాడు! | - | Sakshi
Sakshi News home page

పాపం.. పసివాడు!

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

దత్తత సరిగా జరగలేదంటున్న అధికారులు కన్నవారు, దత్తత తీసుకున్నవారిపై పోలీసు కేసు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల రద్దుకు అధికారుల పోరాటం 2023లో పిల్లాడు జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలోనే జననం కలెక్టరును తప్పుదోవ పట్టిస్తున్నారంటున్న న్యాయవాది బాలుడి భవితవ్యంపై సర్వత్రా ఆందోళన నెలాఖరున పిల్లాడి మూడో పుట్టినరోజు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

‘అమ్మా.. నాకు భయమేస్తోంది..రాత్రిపూట ఒక్కడినే పడుకోలేకపోతున్నా.. నన్ను తీసుకుపో’ అంటూ మూడేళ్ల చిన్నారి దిక్కులు పిక్కటిల్లేలా చేసిన రోదనలు సోషల్‌ మీడియాను కుదిపేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు బాలుడికి మద్దతుగా నిలిచారు. పిల్లాడి విడుదలను పరిశీలించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదు. చివరికి మంత్రులు జోక్యంతో ఆ పసివాడు తల్లి ఒడి చేరాడు. కానీ, ఆ ఆనందం వారికి ఎన్నో రోజులు నిలిచేలా లేదు. బాబును తీసుకెళ్లడాన్ని జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ అధికారులు సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కథ మరో మలుపు తిరిగింది. ఇప్పటికే ఒళ్లంతా గాయాలతో, ఎలర్జీతో బాధపడుతున్న బాలుడు.. శారీరకంగా, మానసికంగా చా లా కుంగిపోయాడు. ఈ నెలాఖరున చిన్నారి మూ డో పుట్టినరోజు సమీపిస్తున్న వేళ.. మళ్లీ తల్లి ఒడికి దూరమైతే.. అతని మానసిక పరిస్థితి మరింత దిగజారుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

అసలేం జరిగింది?

జగిత్యాలకు చెందిన క్యాసరపు శ్రీనివాస్‌ దంపతులకు సంతానం లేదు. దీంతో నిజామాబాద్‌కు చెందిన లక్ష్మణ్‌–సుమలత దంపతుల కుమారుడిని దత్తత తీసుకున్నారు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు 1098 టోల్‌ఫ్రీ నంబరు ద్వారా జిల్లా సీ్త్రశిశు సంక్షేమశాఖకు ఫిర్యాదు చేశారు. దత్తత చెల్లదంటూ ఆగస్టు 26న అధికారులు పిల్లాడిని హోంకు తరలించారు. దత్తతలో అక్రమాలు జరిగాయంటూ శ్రీనివాస్‌గౌడ్‌, సరిత, లక్ష్మణ్‌– సుమలతపై జిల్లా సంక్షేమ అధికారుల ఫిర్యాదుతో జగిత్యాల పీఎస్‌ లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీంతో శ్రీనివాస్‌ దంపతులు న్యాయపోరాటానికి దిగారు. పిల్లాడి అప్పగింతను పరిశీలించాలని జిల్లా అధికారులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయినా వారు పిల్లాడిని తల్లికి అప్పగించలేదు. ఈ ఉత్తర్వులను సస్పెండ్‌ చేయాలంటూ హైకోర్టులో రిట్‌ దాఖలు చేశారు. ఈ పరిణామంపై తల్లిదండ్రులతోపాటు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

క్షీణించిన పిల్లాడి ఆరోగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement