● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట: ప్రభుత్వ విద్యాలయాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. కోనరావుపేట కేజీబీవీలో రూ.56 లక్షలతో నూతన వసతి గృహం, టాయిలెట్స్, రూ.9.50 లక్షలతో భవిత కేంద్ర నిర్మాణానికి, రూ.30లక్షలతో ఐకేపీ గోడౌన్ నిర్మాణానికి గురువారం కలెక్టర్ గరీమా అగ్రవాల్‌తో కలిసి భూమి పూజ చేశారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుందన్నా రు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నిర్మించనుందని తెలిపారు.
త్వరగా పూర్తి చేయాలి
కేజీబీవీ, భవిత సెంటర్, ఐకేపీ గోడౌన్ పనులను త్వరగా మొదలుపెట్టి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, ప్యాక్స్ చైర్మన్లు చేపూరి గంగాధర్, బొమ్మెన భాస్కర్‌రావు, ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సర్పంచులు కాశీరామ్, బోయిని దేవరాజు, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో స్నిగ్ద, జీసీడీవో పద్మజ పాల్గొన్నారు.
పాఠ్యాంశాలు నిత్యం సాధన చేయాలి
విద్యార్థులు అన్ని పాఠ్యాంశాలను నిత్యం సాధన చేయాలని కలెక్టర్ సూచించారు. కోనరావుపేట కేజీబీవీలో విద్యార్థులతో మాట్లాడారు. వంటగదిని పరిశీలించి నాణ్యమైన భోజనం తయారు చేయాలన్నారు. కూరగాయలు, బియ్యం, పప్పుల నాణ్యత పరిశీలించారు. ప్రత్యేకాధికారి ఇందిర, సిబ్బంది ఉన్నారు.


