షుగర్ రోగులు అర్జెంట్‌గా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే పాతబస్టాండ్‌లో చోటు లేదు. తాత్కాలిక టాయిలెట్ బండి చూస్తే మురికిగా ఉంటుంది. ఊరి బయటకు వెళ్లి మూత్ర విసర్జన చేస్తున్నారు. లక్ష జనాభా పట్టణ ప్రధాన బస్టాండులోనే టాయిలెట్ లేకపోవడం ఇబ్బందిగా ఉంది.
– గుజ్జె నవీన్, వ్యాపారి
ఆడవాళ్లను పట్టించుకునే వారు లేరు
మహిళ ప్రయాణికులు పాత బస్టాండుకొస్తే ఒంటికి వెళ్లడానికి సరైన టాయిలెట్ లేదు. అక్కడ ఉన్న తాత్కాలిక బండి కంపు కొడుతోంది, లోపలికి అడుగుపెట్టలేం. ఆడవాళ్లం ఆ బాధను బయటకు చెప్పుకోలేక, ఉగ్గపట్టుకుని కడుపునొప్పితో అల్లాడిపోతున్నారు.
– జవ్వాజి విమల, ఐద్వా మహిళ కార్యదర్శి
నెలాఖరులోగా పూర్తవుతాయి
పాతబస్టాంండులో మోడర్న్ టాయిలెట్స్ నిర్మాణం ఇసుక, ముడిసరుకుల కొరతతో ఆలస్యమైంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నాం. ఈనెలాఖరులోగా పూర్తవుతుంది. ప్రస్తుతం ప్రయాణికుల కోసం తాత్కాలిక టాయిలెట్స్ నిర్వహిస్తున్నాం. పారిశుధ్య విభాగం వాటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
– ఎం.ఎ.ఖదీర్‌పాషా, మున్సిపల్ కమిషనర్


