సిరిసిల్ల అర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లా జిల్లా కేంద్రం పరిధిలోని చంద్రంపేట బైపాస్ చౌరస్తాలో గురువారం బ్లేడ్ ట్రాక్టర్‌ను ఢీకొని ఒకరు మృతి చెందగా మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు. కామారెడ్డి నుంచి ద్విచక్రవాహనంపై వేములవాడ మీదుగా కాళేశ్వరం వెళ్లేందుకు ఇద్దరు యువకులు బైక్‌పై వస్తున్నారు. అదే సమయంలో చంద్రంపేట బైపాస్ చౌరస్తా వద్ద యూ టర్న్ తీసుకుంటున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విజయ్ వంజా తలండి(30) ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందగా, మరొకరు విజయ్ లచ్చా వీరడి గాయపడ్డాడు. వీరిది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పత్తి గ్రామంగా గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వివాహిత అదృశ్యం
గంభీరావుపేట: మండలంలలోని గోరింటాలకు చెందిన వివాహిత బందెల నవిత(29) అదృశ్యమైంది. ఈమేరకు భర్త ప్రశాంత్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ తన భర్తతో గొడవపడి 15 నెలల కుమారుడిని తీసుకొని ఈనెల 4న ఇంటి నుంచి వెళ్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు.


