కల్తీ.. ఎన్నాళ్లీ గల్తీ..! | - | Sakshi
Sakshi News home page

కల్తీ.. ఎన్నాళ్లీ గల్తీ..!

Sep 23 2026 12:07 AM | Updated on Sep 23 2026 12:07 AM

ప్రజారోగ్యానికి ముప్పు.. ఎవరిదీ తప్పు.. పాల నుంచి నెయ్యి వరకు పసుపు నుంచి కారం పొడి వరకు అన్నీ కల్తీమయం

సిరిసిల్ల: వేగవంతమైన నేటి ప్రపంచంలో మనం రోజువారి తినే ఆహారం ఎంతవరకు సురక్షితమో ఎవరికీ అంతుచిక్కని అంశం. చాయపత్తిలో చింత గింజల పొడి, బియ్యంలో రాళ్లు, పాలల్లో నీళ్లు, కా రంలో ఇటుక పొడి, పండ్లను తొందరగా పక్వానికి తెచ్చేందుకు వాడే రసాయనాలు.. బహిరంగంగా స్వీట్ల తయారీ, దుమ్ము దూళితో కూడిన ఆహారాన్ని విక్రయించడం.. ఇలా ప్రతీ దాంట్లోనూ కల్తీ విస్తరించింది. లాభాపేక్షే పరమావధిగా కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా రు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల జరిగిన ఘట నలు ఆహార పదార్థాల్లో కల్తీకి అద్దం పడుతోంది.

ప్రజారోగ్యానికి ముప్పు

ఆహార పదార్థాల నాణ్యతను తగ్గించేలా వాటిలో చౌకబారు, హానికరమైన, వ్యర్థ పదార్థాలను కలపడం, ఆహారంలోని పోషక విలువలను తొలగించడాన్ని ఆహార కల్తీగా పరిగణిస్తారు. కల్తీ ఆహారాన్ని తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అజీర్ణం, వాంతులు, విరోచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు, కాలేయం, మూత్రపిండాలు చెడిపోవడం వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. పోషకాలు లేని, కల్తీ ఆహారం తినడం వల్ల పిల్లలలో శారీరక, మానసిక ఎదుగుదల మందగిస్తుంది. జిల్లాలో అనేక అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల పాలవుతున్నారు.

మొక్కుబడిగా కల్తీ నిరోధక చర్యలు

కల్తీని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మొక్కుబడిగానే ఉంటున్నాయి. ఏదైనా సంఘటన జరిగితే.. హడావుడి చేయడం జరిమానాలతో వదిలేయడం జరుగుతోంది. కల్తీ నిరోధానికి వ్యా పారుల్లో మార్పు రావాలి. వినియోగదారుల్లో చైతన్యంతో కూడిన భాగస్వాములు కావాల్సి ఉంది. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆహార నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. హోటళ్లు, తయారీదారులకు లైసెన్సులు ఇవ్వడం, క్రమం తప్పకుండా తనిఖీలు చేయడం దీని బాధ్యత. ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, కల్తీ చేసే వారిపై భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధించాల్సి ఉంది. కఠినమైన చట్టాలు అమలులో ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కల్తీకి పాల్పడే సంస్థల లైసెన్సులను రద్దు చేయడం, క్రిమినల్‌ కేసులు నమోదు చేయవచ్చు. ఇటీవల కాలంలో జిల్లాలో పలు కేసులు నమోదు అయ్యాయి.

జాగ్రత్తలివీ..

జిల్లాలోని వినియోగదారుల నిత్యావసర వస్తువులపై అవగాహనతో ఉండాలి. గుర్తింపు పొందిన ముద్రలు చూడటం, ఆహార పదార్థాలు కొనేటప్పుడు ప్రభుత్వం నిర్దేంచిన సర్టిఫికేషన్‌ మార్కులు ఉన్నాయో? లేదో? సరిచూసుకోవాలి. సహజ సిద్ధమైన పరీక్షలతో అవి నాణ్యమైవేనా? కాదా? అని పరిశీలించవచ్చు. పాలు, కారం, పసుపు, నెయ్యి వంటి వాటిని ఇంట్లోనే చిన్న చిన్న పరీక్షల ద్వారా కల్తీని గుర్తించే అవకాశం ఉంటుంది. లాభాల కంటే ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాణ్యమైన ముడిసరుకులను మాత్రమే కొనుగోలు చేయాలి. ఆహారమే విషంగా మారే ప్రమాదం ఏర్పడిందనే గుర్తించి, స్వచ్ఛమైన ఆహారం ప్రతీఒక్కరి ప్రాథమిక హక్కుగా భావించాలి.

‘తంగళ్లపల్లి మండలం మండెపల్లి కేసీఆర్‌నగర్‌లో ఇటీవల పానీ పూరీ తిన్న పాతిక మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురై సిరిసిల్ల జనరల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన విద్యార్థులు మామూలు స్థితికి చేరుకున్నారు. పానీపూరీలో కల్తీ జరిగి అపరిశుభ్రంగా తయారు చేయడంతో ఫుడ్‌పాయిజన్‌

అయి అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తేల్చారు.’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement