బోయినపల్లి(చొప్పదండి): చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం, సమతుల్య ఆహారం అవసరమని జిల్లా ఉద్యాన అధికారి శరత్‌బాబు అన్నారు. పోషణమాసం సందర్భంగా మంగళవారం కొదురుపాక అంగన్‌వాడీ కేంద్రంలో అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. వేములవాడ సీడీపీవో సౌందర్య, ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీధర్, నాయకులు కత్తెరపాక సుధాకర్, అన్నలదాస్ లక్ష్మీనారాయణ, నాగుల వంశీ, బాలగోని అనిల్, కార్యదర్శి రాఘవరావు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్లు
పంపిణీ చేయాలి
సిరిసిల్లటౌన్: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన లోపు సిరిసిల్లలో డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయాలని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ గుంటి వేణు అన్నారు. మంగళవారం సిరిసిల్ల శివారులోని మొదటి బైపాస్ రోడ్డులో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను సందర్శించి ఇళ్ల పరిస్థితిని పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 224 ఇళ్లను ఇంతరకు పేదలకు పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు. ఇళ్ల నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 30న సీఎం సిరిసిల్లకు వస్తున్న నేపథ్యంలో సమస్య పరిష్కరించి ఇళ్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. నాయకులు మీసం లక్ష్మణ్, సోమ నాగరాజు, ఎనగంటి రాజు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యతతో పనులు
పూర్తి చేయాలి
సిరిసిల్ల అర్బన్: నాణ్యతతో పనులను సకాలంలో పూర్తి చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి అన్నారు. మంగళవారం 9 వార్డులో రూ.20లక్షలతో చేపట్టిన సీసీ లింక్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. రెండో బైపాస్ రోడ్డు నుంచి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పక్కన ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనం వరకు సీసీ రోడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఖాదీర్‌పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు కళ్యాణి, భాగ్యలక్ష్మి, మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ, డీఈ వాణి, ఏఈ నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.
పౌష్టికాహారం అందించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్కూల్ విద్యార్థులకు, అంగన్‌వాడీ చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం సూచించారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టిక తనిఖీ చేశారు. మండల అభివృద్ధి అధికారి సత్తయ్య, ఎంఈవో కృష్ణహరి, హెచ్‌ఎం దేవరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లాలో చిరు జల్లులు
సిరిసిల్ల: జిల్లాలో మంగళవారం చిరు జల్లులు కురిశాయి. గంభీరావుపేటలో అత్యధికంగా 24.8 మిల్లీ మీటర్ల వర్షం పడగా.. చందుర్తిలో 1.6, సిరిసిల్లలో 11.1, కోనరావుపేటలో 11.9, వీర్నపల్లిలో 2.2, ఎల్లారెడ్డిపేటలో 10.6, ముస్తాబాద్‌లో 4.7, తంగళ్లపల్లిలో 10.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మిగతా మండలాల్లో పెద్దగా వర్షం పడలేదు. జిల్లా సగటు వర్షపాతం 6.0 మిల్లీ మీటర్లుగా నమోదైంది.


