క్రిటికల్‌ కేర్‌ పనులు వేగంగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

క్రిటికల్‌ కేర్‌ పనులు వేగంగా పూర్తి చేయాలి

Sep 23 2026 12:07 AM | Updated on Sep 23 2026 12:07 AM

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆస్పత్రి అభివృద్ధిపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆ స్పత్రిలో పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించా లని, ముందస్తుగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రోజు వారి ఇన్‌ పేషెంట్‌, అవుట్‌పేషె ంట్‌పై ఆరా తీశారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజేశ్వరి, డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్‌, డీసీహెచ్‌ఎస్‌ సుభాషిణి, సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు.

వస్త్రపరిశ్రమ అభివృద్ధిపై కలెక్టర్‌ సమీక్ష

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రతినిధులతో కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి, డైయింగ్‌ యూనిట్లు, పవర్‌ లూమ్‌ల ఆధునీకరణ, తదితర అంశాలపై సమీక్షించారు. సిరిసిల్లలో చిన్న తరహా డైయింగ్‌ యూనిట్ల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై వస్త్రోత్పత్తిదారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు.

స్కానింగ్‌ సెంటర్లపై నిఘా

జిల్లా పరిధిలోని స్కానింగ్‌ కేంద్రాలపై నిఘా ఉంచాలని, బ్రూణహత్యలను కట్టడి చేయాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, బ్రూణ హత్యలతో మగ, ఆడ పిల్లల లింగ నిష్పత్తిపై ప్రభావం చూపుతుందన్నారు.

పోషహారంతోనే బంగారు భవిష్యత్‌

తంగళ్లపల్లి(సిరిసిల్ల): చిన్నారులకు బలవర్ధకమైన పోషకాహారం అందించడం ద్వారానే వారి బంగా రు భవిష్యత్‌కు బలమైన పునాదులు వేయవచ్చని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అన్నారు. పోషణ మాసం సందర్భంగా మంగళవారం తంగళ్లపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో మన అంగన్‌వాడీ.. మన బాధ్యత నినా దంతో చేపట్టిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హా జరై మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ప్రభుత్వం కల్పిస్తున్న పౌష్టికాహార సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, నువ్వులు, బెల్లం, బాలామృతంతో తయారుచేసిన పలురకాల సంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు.

శభాష్‌ మల్లయ్య

సిరిసిల్ల అర్బన్‌: ఎల్‌నినో ప్రభావంతో వరిసాగు వదిలి కూరగాయల సాగు చేస్తున్న మల్లయ్యను చూసి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ శభాష్‌ మల్లయ్య అని అభినందించారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధి పెద్ద బోనాలకు చెందిన రైతు కాశెట్టి మల్లయ్య తనకున్న నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్న వంకాయలు, మిరప, కాకరకాయ, ఇంతర కూరగాయల పంటలను మంగళవారం పరిశీలించారు. కూరగాయలు, ఆకుకూరలు సాగుతో రైతులకు నిరంతరం ఆదాయం వస్తుందన్నారు.

జిల్లా మహిళా సమాఖ్య భవనం పరిశీలన

మెడికల్‌ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న జిల్లా ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులకు కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ మంగళవారం పరిశీలించారు. భవనం బయట, లోపల వివిధ కార్యాలయాలు, డార్మిటరీ, కిచెన్‌, మీటింగ్‌హాల్‌, తదితర పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భవన ఆవరణంలో మొక్కలు నాటాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి అప్జల్‌ బేగం, ఉద్యానవనశాఖ అధికారి శరత్‌బాబు, డీఆర్‌డీవో లక్ష్మీనారాయణ, ఈఈ పీఆర్‌ సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్‌ మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement