వెంటనే నిలుపుదల చేయండి
ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన ఎల్లారెడ్డిపేట సర్పంచ్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని కేశవపెరుమాండ్ల ఆలయానికి చెందిన సుమారు ఐదెకరాల భూమిని పూజారులు రాచర్లబొప్పాపూర్‌కు చెందిన ఓ వ్యాపారికి విక్రయించారని సర్పంచ్ ఎలగందుల నర్సింలు ఆధ్వర్యంలో ఎంపీడీవో సత్తయ్యకు సోమవారం ఫిర్యాదు చేశారు. సర్పంచ్ నర్సింలుతోపాటు గ్రామస్తులు మాట్లాడుతూ భూమి సంబంధికులకు ఫోన్ చేసి ఆరా తీసినట్లు తెలిపారు. ఆలయ భూమి ఇతరులకు చెందకుండా తిరిగి ఆలయానికి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. సింగిల్‌విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు వెంకటనర్సింహరెడ్డి, గుండాడి వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, దూస శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.


